‘ఆచార్య’ కోసం ఇండియాలో అతిపెద్ద టెంపుట్ సెట్..వీడియో రిలీజ్ చేసిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటావ శివ దరకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా కోసం భారీ టెంపుట్ టౌన్ సెట్ ను రూపొందించారు. ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ సెట్ ఇది.. దాదాపు 20 ఎకరాల్లో ఈ టెంపుల్ టౌన్ సెట్ ను నిర్మించారు. అచ్చం పురాతన ఆలయాన్ని తలపిస్తోన్న ఈ దేవాలయం సెట్టింగ్ లో ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. 

ఆచార్య సినిమా కోసం నిర్మించిన ఈ టెంపుల్ సెట్ పరిసరాలు, ప్రత్యేకతలను ఆవిష్కరిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అందమైన ఈ దేవాలయం సెట్టుంగును మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నా అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

Leave a Comment