యూపీలో మరో నిర్భయ ఘటన : ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్.. ఇనుప రాడ్ చొప్పించి..!

ఆలయానికి దైవ దర్శనానికి వెళ్లిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్డు దూర్చి..పక్కటెముకలు విరిచి.. చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లా ఉఘాటికి చెందిన 50 ఏళల ఓ మహిళ జనవరి 3న సాయంత్రం ఆలయానికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఆ ఇంటి తలుపుతు తట్టి ఆమెను పడేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెంది ఉంది. ఆమె శరీరంపై, జననాంగాలపై తీవ్ర గాయాలు ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. 

బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఉఘాటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వారి ఫిర్యాదు పట్ల అలసత్వంగా వ్యవహరించారు. బాధితురాలు చనిపోయిన 18 గంటల తర్వాత గానీ ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించలేదు. శరీరం అంతా గాయాలున్నట్లు, ఆమె జననాంగాలను చిధ్రం చేసినట్లు పోస్టు మార్టం రిపోర్టులో నిర్ధారణ అయింది.

పోస్టు మార్టం రిపోర్టు తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలిని కారులో ఆమె ఇంటికి తీసుకొచ్చిన పూజారి, అతని శిష్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ పరిసరాల్లోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

 

 

Leave a Comment