దేశంలోనే భారీ ఏకశిలా వినాయక విగ్రహం..ఎక్కడుందో తెలుసా?

వినాయక చవితి వచ్చిందంటే చాలు మండపాల్లో కొలువుదీరే గణపయ్యల సందడి అంతా ఇంతా కాదు. వైవిధ్య రూపాల్లో గణనాధుడి విగ్రహాలను కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మండపాలను ఆకర్షణీయంగా అలంకరిస్తారు. వైవిధ్య రూపాల్లో గణనాధుణ్ని తయారు చేసి పూజిస్తారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా గణేష్ ఉత్సవాలు కళ తప్పాయి. సాదాసీదాగా ఈ ఉత్సవాలను జరుపుకోనున్నాము..

కాగా దేశంలోని అనేక గణేష్ ఆలయాల్లోనూ వైవిధ్య విగ్రహాలు ఉన్నాయి. అలాంటి ఓ అరుదైన గణపతి తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో కొలువుదీరి ఉన్నాడు. అవంచలో కొలువుదీరిన గణపతి దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం. ఈ విగ్రహం ఎత్తు 30 అడుగులు ఉంటుంది. ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం దేశంలో మరెక్కడా లేదు. 

ఈ ఏకశిలా విగ్రహం 11వ శతాబ్దం నాటిదని చరిత్ర చెబుతోంది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. అందుకోసం ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రలో ఉంది. అయితే ఆ పని జరుగుతుండగానే తైలంపుడు అనారోగ్యం బారిన పడి అకస్మాత్తుగా మరణించాడు. 

 

Leave a Comment