మెగాస్టార్ బర్త్ డే.. హ్యాపీ బర్త్ డే అన్నయ్య..!

మెగాస్టార్ చిరంజీవి..ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరో..కుర్ర హీరోలతో పోటీపడి నటిస్తారు. తన డ్యాన్స్, నటనతో అభిమానులను అలరిస్తుంటారు. తెలుగు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోల తర్వాత టాలీవుడ్ లో ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో చిరు. చిరంజీవి ‘బాస్ ఆఫ్ తెలుగు సినిమా’ హోదాను సంపాదించుకున్నారు. ఇటు సినిమాల్లోనే కాకుండా రాజకీయరంగ ప్రవేశం చేసి కేంద్ర మంత్రిగా పనిచేశారు. మన మెగాస్టార్ నేడు 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.  దీంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల కోలాహలం మొదలైంది. 

ఈ రోజు ఇంకో ప్రత్యేక ఉంది. అది మీకు తెలిసిందే..అదే వినాయక చవితి..ఇక్కడ ఓ విశేషం ఏంటంటే. గత సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 2న వచ్చింది. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు..ఈ ఏడాది ఆగస్టు 22న వినాయక చవితి వచ్చింది. నేడు మన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు..ఇలా రావడంతో ఇక మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇక మెగాస్టార్ తన నాలుగు దశాబ్దాల కేరీర్ లో రకరకాల పాత్రలు చేశారు. 1978లో పునాధిరాళ్లు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచారు. మెగాస్టార్ ఇప్పటికీ కూడా టాలీవుడ్ నెం.1 సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు. 

కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పెరుగుతున్న కారణంగా ఈ ఏడాది తన పుట్టినరోజును సింపుల్ గా జరుపుకోవాలని చిరంజీవి తన అభిమానులను కోరారు. ఈ సమయంలో తన పుట్టిన రోజును బైక్ ర్యాలీలతో జరుపుకోవద్దని, కేకుల్ కట్ చేయాలంటూ కోవిడ్ నియమాలు పాటించాలని కోరారు. అభిమానులు కూడా తమ బాస్ చెప్పినట్లు నియమాలు పాటిస్తూ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు.  

Leave a Comment