వరకట్నంగా ఒక్క రూపాయి..ఒక కొబ్బరి బోండం..

పెళ్లంటే చాలు కట్నకానుల గురించి మాట్లాడుకుంటారు. కానీ రక్షణ శాఖలో పని చేస్తున్న జవాన్ కట్నంగా ఒక్క రూపాయి, ఒక కొబ్బరి బోండంను తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. గంగోహ్ పరిధిలోని జుఖెడి గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్ మూడేళ్ల పాటు కార్గిల్ లో విధులు నిర్వహించాడు. ప్రస్తుతం లక్నోలో డ్యూటీ చేస్తున్నాడు. 

వివేక్ కు బీన్డాకు చెందిన అరవింద్ కుమార్ కుమార్తె ప్రియతో నవంబర్ 30న వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు వివేక్ కు కట్నకానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాలనుకున్నారు. అయితే తనకు ఎటువంటి కట్నకానుకలు వద్దని, కేవలం ఒక్క రూపాయి, కొబ్బరి బోండం చాలని చెప్పాడు. వధువే తనకు అందమైన కట్నమని తెలిపాడు. వివేక్ మంచి తనానికి అమ్మాయి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.  

Leave a Comment