ఒకే సారి ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్ ను గర్భవతులు చేసిన నైజీరియన్..!

ఇండియాలో సాధారణంగా ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకుంటాడు.ఇంకా కొన్ని చోట్ల ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు. అయితే విదేశాల్లో అలా కాదు.. ఒక వ్యక్తి ఇద్దరు లేదా ముగ్గురిని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఇంకొందరు డేటింగ్ చేసి అక్కడితో ఆపేస్తారు. నైజీరియాకు చెందిన క్లబ్ ఓనర్ ప్రెట్టీ మైక్ కూడా అలాగే చేశాడు. 

ఒకేసారి ఆరుగురు అమ్మాయిలతో ప్రెట్టీ డేటింగ్ చేశాడు. ఇందులో విశేషం ఏం అనుకుంటున్నారా? ఆ ఆరుగురు అమ్మాయిలు కూడా ఇప్పుడు గర్భివతులు కావడమే. ఇటీవల మైక్ తన స్నేహితుడు, యాక్టర్ పాల్ విలియమ్స్ ఉచెంబో వివాహానికి తన ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్ తో హాజరయ్యాడు. ఈ వివాహంలో వారు ఒకే కలర్ దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు. తనకు ఒకేసారి ఆరుగురు బిడ్డల్ని ఇవ్వబోతున్న వారి పొట్టపై చేయి వేసి నిమురుతూ వారిని ముద్దు పెట్టుకున్నాడు. 

Leave a Comment