భారం కాకూడదనే…!

ఇద్దరు యువతుల ఆత్మహత్య

హయత్ నగర్ : ‘మేము ఎవరికీ భారం కాకూడదు..మమ్మల్ని క్షమించండి..మా చావుకు ఎవరూ కారణం కాదు..మా గురించి చెడుగా అనుకోవద్దు..’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఇద్దరు స్నేహితురాళ్లు ఉరి వేసుకుని ఆత్మహత్య కేసుకున్న ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..మహబూబ్ నగర్ జిల్లా పోతనపల్లికి చెందిన రాయని రాములు, తిరుపతమ్మ దంపతుల కుమార్తె మమత(20), ఇద్దరు కుమారులతో కలిసి హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాదవరం గ్రామానికి చెందిన బాషం నారాయణ, నారాయణమ్మ దంపతుల కుమార్తె గౌతమి(20)తో కలిసి హయత్ నగర్ డివిజన్ లోని శ్రీనివాస కాలనీలో ఉంటున్నారు. గతంలో ఇరువురి కుంటుంబాలు శ్రీనివాస కాలనీలో పక్కపక్కనే నివాసముండటం వల్ల గౌతమి, మమతల మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఇంటర్ వరకూ చదువుకున్నారు. మమత ఓ ప్రైవేటు పాఠశాలలో పని చూస్తుండా, గౌతమి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గౌతమికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మమత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మమత తల్లిదండ్రులు, సోదరుడు స్వగ్రామంలోని బంధువుల శుభకార్యానికి వెళ్లగా.. ఇంకో తమ్ముడు పాఠశాలకు వెళ్లాడు. ఆ సమయంలో గౌతమి మమత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకున్నారు. సాయంత్రం సమయంలో మమత తమ్మడు ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.