‘తెలుగు అమ్మలాంటిది’

 శ్రీకాకుళం : బడుగు, బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని సినీయర్‌ నటుడు ఆర్‌ నారాయణమూర్తి పేర్కొన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధన సీఎం జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. శుక్రవారం జిల్లాలో పేద ప్రజల అభివృద్ధి, ఆంగ్ర విద్యపై సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుపూడి ప్రభాకర్‌, సినీ నటుడు ఆర్‌ నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఆంగ్ల విద్య ద్వారా పేద, ధనిక అంతరాలు తగ్గుతాయని అన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్‌ విద్య అవసరమని ఆర్‌ నారాయణమూర్తి తెలిపారు. తెలుగు భాష అమ్మలాంటిదని, ఇంగ్లీష్‌ భాష నాన్నలాంటిదన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్‌ ఇంగ్లీష్‌ విద్య ప్రవేశపెడితే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి గొప్ప లైకికవాది అని ప్రశంసించారు. ఇంగ్లీష్‌ విద్య తీసుకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు అందరూ రుణపడి ఉంటారని, ఈ విధానానికి రాజకీయ నేతలంతా సహకరించాలని కోరారు.

Leave a Comment