దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

మహిళల భద్రతకు భరోసా ఇచ్చేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పడు మరో ముందడుగు వేసింది. మహిళల రక్షణ కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళల కోసం దిశ యాప్ ను సీఎం లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్లొన్నారు. 

దిశ చట్టాన్ని పటిష్టంగా అమలుకు చర్యలు..

దిశ చట్టం పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణాయాలు తీసుకుంది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఇద్దరు మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి కృతిక శుక్లా, 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి ఎం.దీపికను దిశ చట్టం అమలు బాధ్యతల పర్యవేక్షణ కోసం నియమించింది. 

విచారణ ఇలా..

ఈ చట్టంలో అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేసి, 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్త చేస్తుంది. అనంతరం 21 రోజుల్లోనే శిక్ష ఖరారు చేస్తుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటి సారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండో సారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.