పీరియడ్స్ దాచి పెట్టిందని విడాకులు కోరిన భర్త..!

మహిళల్లో పీరియడ్స్ సహజం..పీరియడ్స్ సమయంలో ఎటూ వెళ్లకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి అంటూ కొందరు రూల్స్ పెడుతుంటారు. అయితే పీరియడ్స్ అనేవి మహిళల శరీర ధర్మంలో ఓ భాగమని మహిళా సంఘాలు చెబుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి పీరియడ్స్ గురించి చెప్పలేదని ఆమెకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంకా తన కోరికలు తీర్చడం తన వల్ల కాదంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరలో జరిగింది. 

టీచర్ గా పనిచేస్తున్న ఓ మహిళకు, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి ఈ ఏడాది జనవరిలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వారు గుడిలో దైవదర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో సదరు మహిళ తాను గుడి లోపలకు రాలేనని చెప్పింది. తనకు పీరియడ్స్ వచ్చిన విషయాన్ని భర్తకు తెలిపింది. అయితే ఆ విషయాన్ని భర్తకు ముందుగా చెప్పలేదు. 

దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె తమ నమ్మకాలను వమ్ము చేసిందని విడాకుల కోసం పిటిషన్ వేశాడు. ఇంట్లో తన జీతం ఇవ్వకూడదని చెప్పేదన్నాడు. ఆమెకు ఖుర్చుల కోసం నెలకు రూ.5 వేలు అడుగుతోందన్నాడు. ఇంట్లో ఏసీ కొనాలని వేధిస్తోందన్నాడు. ఏసీ కొననందుకు తనను విడిచి పుట్టింటికి వెళ్లిందన్నాడు. 

ఆమె కోరికలను తీర్చడం తన వల్ల కాదని చెప్పడంతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయేదని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆమెను బతిమిలాడి ఇంటికి తెచ్చుకుంటే మళ్లీ గొడవపడి పుట్టింటికి వెళ్లిపోతుందని చెప్పాడు. తన కోరికలను తీర్చలేనివాడివని ముందే తెలిస్తే పెళ్లి రోజు రాత్రి తాను 10 మందితో పడుకునే దాన్నని నీచంగా మాట్లడేదన్నాడు. 

ఆమె మాటలను పట్టించుకోకుండా కలిసి వెళ్తున్న గొడవలు మాత్రం ఆగడం లేదన్నారు. ఓ రోజు టెర్రస్ మీద నుంచి దూకి చనిపోతానని బెదిరించేదని పిటిషన్ లో పేర్కొన్నాడు. తనతో కలిసి ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అయిపోయాయని చెప్పాడు. ఆమెతో వేగలేనని, ఎలాగైనా విడాకులు ఇప్పించాలని కోరాడు.  

     

 

Leave a Comment