మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఎస్ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆయన స్థానంలో తమిళనాడు రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. అయితే రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌‌పై సోమవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఎస్ఈసీ నియామకం అర్హతల మార్పు ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే.

నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై  నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అలాగే రమేష్ కుమార్ తొలగింపుపై టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

Leave a Comment