‘వకీల్ సాబ్’ గురించి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం Vakil saab గురించి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ లో తను కొత్తగా కనిస్తానని, ఇది తనకు కరెక్టుగా సరిపోయిన పాత్ర అని Pawan Kalyan తనతో చెప్పినట్లు చెప్పారు. ఇది హిందీ రీమేక్ అయినప్పటికీ తెలుగులో మార్పులు చేశారట. ఇక క్రిష్ సినిమా కథా నేపథ్యం గురించి కూడా రకరకాలుగా రాస్తున్నారు. మొగలాయిల కాలంలో ‘కోహినూర్’ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

చాలా పవర్ఫుల్ పాత్రలో పవన్ కనిపిస్తాడని చెప్పారు. పవన్ చేస్తున్న ఈ రెండు సినిమాలు ప్రత్యేకమైనవి కావడం ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు వున్నాయి. వేణు శ్రీరామ్ .. క్రిష్ ..  హరీశ్ శంకర్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూడింటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలోని ‘వకీల్ సాబ్’ చాలా వరకూ షూటింగు జరుపుకుంది. క్రిష్ దర్శకత్వంలోని సినిమా పట్టాలెక్కవలసి వుంది. 

Leave a Comment