గ్రామ వాలంటీర్ల తొలగింపుపై క్లారటీ ఇచ్చిన ప్రభుత్వం..!

35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురు వాలంటీర్లను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. వీరిని తప్ప మరెవరినీ తొలగించడం లేదని అన్నారు. 

ఇక ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులను ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్వర్వులు ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వాలంటీర్ల ఖాళీల వివరాలను ఆయా జేసీల దృష్టికి తీసుకురావాలన్నారు. 

Leave a Comment