లీటర్ పెట్రోల్ రూ.40కే అమ్మాలి : బీజేపీ ఎంపీ

బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు తమ పార్టీ వైఖరికీ వ్యతిరేకంగా ఉంటాయి. ఆయన తన మనసులో మాటను బాహాటంగానే చెప్పేస్తారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన వ్యతిరేకించారు. కరోనా మహమ్మారి పరీక్షల నుంచి ఇంధన ధరుల వరకు ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

తాజాగా ఆయన ట్విట్టర్ లో ఇంధన ధరలపై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెంపుపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా రూ.40 ఉండాలని ట్వీట్ చేశారు. లీటర్ పెట్రోల్ ధర రూ.90 అంటే భారత ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నట్లే అని, ఎక్స్ రిఫైనరీలో లీటర్ పెట్రోల్ ధర రూ.30 మాత్రమే ఉందని పేర్కొన్నారు. అన్ని రకాల పన్నులు, పెట్రోల్ పంపు కమీషన్ రూ.60 వరకు ఉంటుందని, తన దృష్టిలో లీటర్ పెట్రోల్ ను గరిష్టంగా రూ.40కే అమ్మాలని సుబ్రహ్మణ్యస్వామి సూచించారు.   

Leave a Comment