వ్యవసాయ చట్టాల్లో సవరణలపై కేంద్రం ప్రతిపాదనలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ కూడా విజయవంతమైంది. రైతులు తమ డిమాండ్లపై పట్టువిడవకపోవడతో హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘం నాయకులతో చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరియు రైతుల మధ్య మరో దఫా చర్చలు జరుగనున్న తరుణంలో ప్రభుత్వం రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపింది. 

కేంద్ర ప్రతిపాదనలు ఇవే..

  • మార్కెట్ కమిటీలపై రైతులు అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ.
  • ఏపీఎంసీల్లో ఒకే పన్ను విధానం.
  • ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా నిబంధనల్లో మార్పు.
  • ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేయడం. 
  • ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 
  • కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ.
  • ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా నిబంధనలు
  • వ్యాపారులు మరియు రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్డీఎంల అధికారల సవరణ.
  • ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు..

Leave a Comment