గుడ్ న్యూస్ : రైతుల కోసం భారీ స్కీమ్

ప్రధాన మంత్రి మోడీ రైతులకు మరో శుభవార్త అందించనున్నారు. రైతుల కోసం భారీ స్కీమ్ లాంచ్ చేయబోతున్నారు. ‘అగ్రి ఇన్ ఫ్రా ఫండ్’ కింద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలతో ఫైనాన్సింగ్ సదుపాయాన్నిప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. 

పీఎం కిసాన్ పథకం కింద 8.5 కోట్ల మంది రైతులకు ఆరో విడత రూ.17 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో కేంద్రం లక్ష కోట్లతో ‘అగ్రి ఇన్ ఫ్రా ఫండ్’ ఏర్పాటు చేయబోతుంది. 2029 వరకు ఈ ఫండ్ అమలులో ఉంటుంది.

ఈ స్కీమ్ రూరల్ ఏరియాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రేవేటు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. ఫార్మ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో మధ్యస్థ-దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్ ను సులభతరం చేయడం దీని లక్ష్యం. దీని వల్ల గ్రామీణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెంచుతుంది..మరియు ఎక్కువ ఉపాధిని కల్పిస్తుంది. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు, రైతు సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు, వ్యవసాయ పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ లు మరియు అగ్రి టెక్ తో సంబంధం ఉన్న వ్యక్తులు రుణాలు పొందవచ్చు. 

 

Leave a Comment