సెప్టెంబర్ లో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం..!

తెలంగాణాలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయని, సెప్టెంబర్ చివరికి తెలంగాణాలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణాలో రోజుకు 23 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. 

ఇక గ్రేటర్ హైదరాబాద్ లోనూ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్ని చెప్పారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా రెండు వారాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. కొన్ని ఆస్పత్రులు కరోనా కేసులకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ ఆస్పత్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని వెల్లడించారు. 

రాష్ట్రంలో దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు అనుమతి ఉందని, వాటిలో ప్రస్తుతం 91 ఆస్పత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరిన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని చెప్పారు.   

Leave a Comment