గుడ్ న్యూస్ : షరతులతో మరి కొన్నింటికి సడలింపు

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించింది. నివాస ప్రాంతాల్లోని అన్ని దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ చేయబడిన దుకాణాలు అన్ని తెరుచుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలలో ఉన్న షాపింగ్ మాల్స్ కు అనుమతి ఇవ్వలేదు. మరియు హాట్ స్పాట్, కంటైన్ మెంట్ జోన్లు ఉన్న ఏరియాల్లో దుకాణాలు తెరవకూడదని కేంద్ర చెప్పింది. అయితే తెరిచిన షాపుల్లో కేవలం 50 శాతం సిబ్బంది మాత్రమే ఉండాలని సూచించింది. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. 

ఇప్పటి వరకు కేవలం కిరాణా దుకాణాలు, నిత్యవసర, మెడికల్, ఫార్మసీలకు మాత్రమే అనుమతి  ఉంది. తాజా సడలింపులతో సెలూన్స్, బార్బర్ షాప్స్, స్టేషనరీ, డ్రైక్లీనింగ్, ఎలక్ట్రికల్ స్టోర్స్ తెరుచుకోవచ్చని తెలిపింది. అలాగే నివాస ప్రాంతాల్లోని దర్జి షాపులు కూడా తెరుచుకోవచ్చు. 

Leave a Comment