బ్లాక్ సీడ్స్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Kalonji ఈ పేరు చాలా మందికి తెలీదు. దీనిని భూమిపై దొరికే సంజీవని అని కూడా పిలుస్తారు. Kalonji ని సరైన మార్గంలో తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నయం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.  వేల సంవత్సరాల నుంచి సంప్రదాయ చైనా వైద్యంలోనూ, ఆయుర్వేదం, యునాని  వైద్యంలోనూ దీనిని ఉపయోగిస్తారు. Kalonjiలో విటమిన్ బి1,బి2, బి3 లతో పాటు అధిక మొత్తంలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్లు, ఐరన్, కాపర్, పాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా చాలా రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చని చెబుతారు. ఇప్పుడి Kalonji  యొక్క కొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.

Kalonji యొక్క ఆరోగ్య ప్రయోజనాలు(Benefits of Kalonji):

జుట్టు సంరక్షణకు లాభదాయకం..

జుట్టు సంరక్షణకు Kalonji బాగా ఉపయోగపడుతుంది. Kalonji నూనెను మీ తలపై మర్దన చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పొరిబారటం, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. Kalonji నూనెను వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది.  

డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది..

ప్రతి రోజు 2 గ్రాముల Kalonji తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని పరిశోధనల్లో తేలింది. Kalonji డయాబెటీస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. 

రక్తపోటు నియంత్రణకు..

ప్రతి రోజు కొన్ని Kalonji సీడ్స్ ను రెండు సార్లు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. లేదా అర టీస్పూన్ Kalonji నూనెను వెచ్చని నీటితో తాగడం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దానితో పాటు సరైన డైట్ పాటించడం ముఖ్యం. 

చర్మ రుగ్మతలను దూరం చేస్తుంది..

Kalonji నూనె సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉంటే ఫాటి యాసిడ్స్, విటమిన్స్, యాంటి ఆక్సిడెంట్స్ చర్మపు ఆరోగ్యం కాపాడటంలో సహాయపడతాయి. వయస్సు మీద పడటం వల్ల వచ్చే ముడతలను ఇది నివారిస్తుంది.

ముటిమలు, మొహంపై నల్లని మచ్చలని ఇది నివారిస్తుంది. Kalonji విత్తనాల పొడిని కొబ్బరి నూనెతో కలిపి చర్మంపై మసాజ్ చేయడం వల్ల చర్మ రుగ్మతలు తొలగిపోతాయి. 

రక్తహీనతలకు ప్రయోజనకరం..

Kalonji రక్తహీనతకు బాగా ఉపయోగపడుతుంది. 50 గ్రాముల పుదీనా ఆకులను, మరియు Kalonjiని ఒక కప్పు నీటిలో కలపాలి. దానిని ఉడకబెట్టాలి. చల్లబడిన తరువాత ఆ నీటిని తాగాలి. ఇలా ఉదయం మరియు రాత్రి నిద్రపోయే ముందు 21 రోజులు తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. 

రోగనిరోధక శక్తి పెరుగుదలకు..

Kalonjiని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. Kalonji నూనె, తేనెను గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వేడి నీటిలో Kalonji నూనె వేసి దానిని పీల్చడం వల్ల నాసల్ సమస్యను నివారించవచ్చు మరియు సైనసిటీస్ సమస్యతో బాధపడే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. 

దగ్గు నివారణకు..

దగ్గు నివారణకు Kalonji బాగా ఉపయోగపడుతుంది. అర టీ స్పూన్ Kalonji నూనె, ఒక కప్పు గోరు వెచ్చని నీరు మరియు రెండు టీ స్పూన్ల తేనెను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల దగ్గు మరియు జలుబు తగ్గేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. 

బరువు తగ్గేందుకు..

Kalonji లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఓబేసిటీ తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గేందుకు చాలా మంది గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనెను వాడతారు. ఇప్పుడు ఈ మిశ్రమానికి చిటికెడు Kalonji విత్తనాల పొడిని కలిపి తీసుకోండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక బరువును తగ్గంచడంలో సహాయపడుతుంది. 

పురుషుల్లో లైంగిక సమస్యలు..

అంగస్తంభన సమస్యలతో చాలా మంది పురుషులు బాధపడుతుంటారు. అలాంటి వారికి కలోంజి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం అర టీ స్పూన్ కలోంజి విత్తనాలు, అర టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ తేనే మూడు కలిపి కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా అంగస్తంభన సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

 

Leave a Comment