అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న తొలి తెలుగమ్మాయి.. చిరంజీవి విషెస్..!

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేయబోతుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా శిరీష రికార్డు సృష్టించింది. 

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈనెల 11న అంతరిక్ష వాహక నౌక యూనిటీ-22ను ప్రయోగించనుంది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్ తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు సంస్థ ప్రకటించింది. 

శిరీష తల్లిదండ్రులు డాక్టర్ అనురాధ, డాక్టర్ మురశీధర్ రావు చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. శిరీష అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైంది. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్ లో పలు కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. 

ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న తొలి తెలుగమ్మాయి శిరీషకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ‘బండ్ల శిరీష అద్భుతమైన ఫీట్ సాధించబోతున్నావు. తల్లిదండ్రులు, తెలుగువారు, ఇండియన్స్ అందరు గర్వపడే సమయం ఇది. మీ మిషన్ విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చిరు పేర్కొన్నారు. 

 

 

Leave a Comment