పోలీస్ కూతురికి ప్రేమతో సెల్యూట్ చేసిన తండ్రి..!

పోలీసు డిపార్ట్మెంట్ లో తన  ఉన్నతాధికారికి సెల్యూట్ చేయడం సాధారణం.  కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన కూతురు అయితే? ఆ సెల్యూట్ లో ఆనందంతో పాటు ప్రేమ – గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో నిర్వహిస్తున్న  మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” అని పేరు పెట్టారు.

 2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. జెస్సీ ప్రశాంతి ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగం లో భాద్యతలు  నిర్వహిస్తున్నారు. శామ్ సుందర్ తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు. తిరుపతి లో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు శామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు.

 తను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్నా…అంటూ గట్టిగా నవ్వేశారు…పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు. నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని సిఐ శామ్ నుందర్ అన్నారు . పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి “ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటామ్ తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా  గర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి” అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు.

Leave a Comment