కొడుకు ప్రవర్తన నచ్చక.. పెంపుడు కుక్కకు సగం ఆస్తి రాసిచ్చాడు..!

పిల్లల ప్రవర్తన నచ్చక పెంపుడు కుక్కకు సగం ఆస్తిని రాసిచ్చాడు ఓ రైతు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లా బరిబాడ గ్రామంలో చోటుచేసుకుంది. బరిబాడకు చెందిన 50 ఏళ్ల ఓం నారాయణ అనే రైతు జాకీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అతనికి 21 ఎకరాల పొలం ఉంది. అయితే ఆస్తి పంపకాలకు సంబంధించి తన కుమారులతో విభేదాలు ఉండటంతో పాటు వారి ప్రవర్తన ఓం నారాయణకు నచ్చలేదు.

 దీంతో ఓం నారాయణ సగం ఆస్తిని తన భార్య పేరు మీద రాసి, మిగతా సగం ఆస్తిని తన పెంపుడు కుక్క జాకీ పేరుపై వీలునామా రాశాడు. భార్య, పెంపుడు కుక్క మాత్రమే తన బాగోగులు చూస్తున్నారని, అందేకే వారికే తన ఆస్తి వర్తించేలా వీలునామా రాశానని ఓం నారాయణ చెప్పుకొచ్చాడు. 

తాను చనిపోయిన తర్వాత ఆ కుక్క అనాథగా మారడం ఇష్టం లేక ఈ పనిచేశానని, తన తర్వాత ఆ కుక్క బాగోగులు చేసే వారికి ఆ ఆస్తి దక్కుతుందని పేర్కొన్నాడు. తర్వాత ఆ గ్రామ సర్పంచ్ సముదాయించడంతో ఆ వీలునామాను వెనక్కి తీసుకున్నాడు. కానీ ఈ వ్యవహారం ప్రస్తుతం వైరల్ గా మారింది. 

 

Leave a Comment