జియో న్యూఇయర్ గిఫ్ట్.. మళ్లీ అన్ని ఫ్రీ..!

రిలయన్స్ జియో తన వినియోగదారులకు నూతన సంవత్సర కానుకను ఇచ్చింది. తన వినియోగదారుల కోసం ఇతర నెట్ వర్క్ కు ఫ్రీ వాయిస్ కాల్స్ మళ్లీ అందిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు 2021 జనవరి 1 నుంచి దేశంలో బిల్ అండ్ కీప్ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా అన్ని దేశీయ వాయిస్ కాల్స్ కు ఇంటర్ కనెక్ట్ యూజ్ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. 

ఆఫ్ నెట్ దేశీయ వాయిస్ కాల్ ఛార్జీలను సున్నాకు మార్చాలన్న తమ ప్రకటనకు కట్టుబడి ఉంటున్నట్లు పేర్కొంది. ఐయూసీ ఛార్జీలు రద్దు చేసిన వెంటనే జియో మరోసారి 2021 జనవరి నుంచి అన్ని ఆఫ్ నెట్ దేశీయ వాయిస్ కాల్స్ ను ఉచితంగా అందజేయనుంది. ఇప్పటి వరకు ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవాలంటే నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. ఈ కాల్స్ కోసం రూ.10 నుంచి టాపప్ ఓచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇక న్యూఇయర్ సందర్భంగా తన యూజర్లకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ దేశీయంగా ఏ నెట్ వర్క్ కు కాల్ చేసినా.. ఇక ఫ్రీ అని ప్రకటించింది.  

 

Leave a Comment