పార్టీకి ధైర్యవంతులు కావాలి –  పవన్

రాజమండ్రి : ప్రస్తుత సమాజం పిరికిగా తయారైందని, తనకు అలాంటి వారి అవసరం లేదని, పార్టీలో ధైర్యవంతులు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శనివారం జనసేన పార్టీ ఆవిర్బావం సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను పార్టీ పెట్టినప్పడు మేథావులు ఎవరూ తనతో లేరని, తనతో ఏకీభవించే వారు కూడా ఎవరూ లేరని తెలిపారు. కులాలు కలుపుకుని రాజకీయాలు చేద్దామని అందరూ వచ్చారన్నారు. కుల మాటలకూ అతీతంగా యువతను నమ్మానని, పార్టీలోకి వచ్చిన వారంతా మళ్లీ పారిపోతారని తనకు తెలసని చెప్పారు. 

తనకు మంచి యాక్టింగ్ కేరీర్ ఉన్నా రాజకీయం ఎంచుకున్నానని, నిజజీవితం గురించి మాట్లాడితే నలుగురు తనను కొడతారేమోనన్న భయం తనకు లేదని స్పష్టం చేశారు. తాను రాజమండ్రిలో కవాతు నిర్వహించిన్పుడు దాదాపు 10 లక్షల మంది వచ్చారని, కానీ వారంతా నేరస్తులకు ఓటు వేశారని తెలిపారు. ఓటమిని ఒప్పుకునే దమ్ము లేక ఓటు అమ్ముకున్నారన్నారు. అసలు ఓటమిని ఒప్పుకోవడం ఎంత కష్టమో తాను చెబుతానని ఆవేదన వ్యక్తం చేశారు. 

నేరస్తులను ప్రోత్సహించకుండా రాజకీయాలు చేయాలి..

ఓటమిని ఎదురొద్దటానికి బలమైన భావజాలాలు కావాలని, నేరస్తుల్ని ప్రోత్సహించకుండా రాజకీయాలు చేయాలని, ఓటమిని ఒప్పుకునే మనోధైర్యం కావాలని  అని ఆయన చెప్పుకొచ్చారు. తానేం వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఓ ప్రాంతం లోని నాయకులూ మరో ప్రాంతం లో ప్రజల్ని తిట్టడమేంటని, నాయకత్వ లోపాలకి ప్రజల తప్పిదాలకు లింక్ లేదని ఆయన అన్నారు. అప్పట్లోనే ఆంధ్ర పాలకుల తప్పులకు, ఆంధ్ర ప్రజలకు అంటగట్టి తిట్టడమేంటని తాను ఆలోచించానని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనిపై మాట్లాడటానికి కూడా ఎవరికీ ధైర్యం లేదన్నారు. మాట్లాడితే ఎక్కడ దాడులు జరుగుతాయో అని భయపడే వారు కూడా ఉన్నారన్నారు. ఇలాంటి సమాజానికి ధైర్యం నూరి పోయడానికే, తానూ పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Leave a Comment