యజమాని కోసం 6 రోజులు హాస్పిటల్ బయటే ఎదురుచూసింది..!

నిజంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరని చెప్పాలి.. ఎందుకంటే వాటికి ఒక్క పూట తిండి పెట్టిన వ్యక్తి ఇంటికి కాపాలా కాస్తాయి. తాజాగా ఓ కుక్క తన యజమాని పట్ల అంతకు మించిన విశ్వాసాన్ని చూపించింది. ఆపరేషన్ కోసం హాస్పిటల్ లో చేరిన యజమాని కోసం ఓ కుక్క ఆరు రోజుల పాటు హాస్పిటల్ బయట ఎదురుచూసింది. ఈ ఘటన టర్కీలో చోటుచేసుకుంది. 

ట్రాబ్జాన్ సిటీకి చెందిన 68 ఏళ్ల సెమెల్ సెంటర్క్ అనే వ్యక్తి బోన్ కక్ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం సెమెల్ బ్రేయిన్ సర్జరీ చేయించుకోవటానికి హాస్పిటల్ లో చేరాడు. అతడు కోలుకోవడానికి ఆరు రోజులు పట్టింది. అయితే తన కుక్క మాత్రం తన యజమాని బయటకు వచ్చేంత వరకు హాస్పిటల్ బయటే ఎదురుచూసింది. 

సెమెల్ కూతురు బోన్ కక్ ను ఇంటికీ తీసుకెళ్లినా అది మళ్లీ హాస్పిటల్ కు తిరిగొచ్చేది. బోన్ కక్ కు హాస్పిటల్ సిబ్బంది తిండి, నీళ్లు అందించారు. చివరికి తన యజమాని ఆరు రోజులకు కోలుకున్నాడు. అనంతరం అతని వెంటే పరిగెడుతూ, అటు ఇటు గెంతుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. 

 

Leave a Comment