5జీ టెస్టింగ్ వల్లే సెకండ్ వేవ్.. నిజమెంత?

ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 5జీ టెస్టింగ్ వల్లనే వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రారంభమైందని, దీనిని టెస్ట్ చేసిన రాష్ట్రాలు యూపీ, బీహార్, మహారాష్ట్రలో భారీ సంఖ్యలో జనాలు మరణించారని ఆడియో క్లిప్ లో ఉంది. ఈనేపథ్యంలో ప్రెస్ ఇన్ ఫర్మెషన్ బ్యూరో(పీఐబీ) వీటిలో వాస్తవాలను తేల్చేందుకు రంగంలో దిగింది. టెలికామ్ అధికారులను కలిసింది. 

అయితే ఈ వార్తలను టెలికమ్ అధికారులు ఖండించారు. ఇవన్ని పుకార్లని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తికి, 5జీ టెక్నాలజీకి సంబంధించిన పుకార్లపై టెలికాం పరిశ్రమ సంస్థ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు సీఓఏఐ, టవర్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్(టీఏఐపీఏ) శుక్రవారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. 

కోవిడ్ కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణం అంటూ కొన్ని ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించిందని, 5జీ టెక్నాలజీకి, కోవిడ్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని పేర్కొన్నాయి. 

 

Leave a Comment