మారువేశంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లిన పోలీస్ కమిషనర్..!

సామాన్యులు స్టేషన్ క వెళ్తే పోలీసులు వారితో ఎలా ఉంటారు.. ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలనుకున్నారు.. అందుకు ముస్లిం దంపతుల్లా మారు వేషంలో మూడు పోలీస్ స్టేసన్లలో తనిఖీలు నిర్వహించారు ముంబై పింప్రి పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాష్, ఆయన భార్య అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రేర్నా కట్టేలు.. కృష్ణ ప్రకాశ్ ముస్లిం వేషదారణలో పెట్టుడు గడ్డం పెట్టుకోగా, భార్య ప్రేర్నా సాధారణ గృహిణిగా వెళ్లారు. అలా మూడు పోలీస్ స్టేషన్లలో తనిఖీ నిర్వహించారు..

ముందుగా ముంబైలోని హింజెవాడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దంపతులు ఇద్దరు కంగారుగా సార్ సార్ నా పేరు జమల్ కమల్ కాన్ మేమిద్దరం ప్రార్థనల్ని ముగించుకొని తిరిగి వస్తుండగా నా భార్యను వేధించారంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు..

ఆ తర్వాత వాకాడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మేం బైక్ పై వెళ్తుంటే కొందరు అగంతకులు నా భార్య మెడలో చైన్ కొట్టేశారు.. న్యాయం చేయండి అని ఫిర్యాదు చేశారు. దీంతో స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. దంపతులను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు..

చివరగా పింప్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. కరోనా పేషంట్ ను అంబులెన్స్ లో తీసుకొని వెళ్లమని అడుగుతుంటే డ్రైవర్ రూ.8 వేలు లంచం అడుగుతున్నాడని, కేసు నమోదు చేయాలని కోరారు. కానీ పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇది తమ స్టేషన్ పరిధిలోకి రాదని, మీ పరిధి స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాశ్ తన అసలు రూపం చూపించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హింజెవాడి పోలీస్ స్టేషన్, వాకాడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు వ్యవహరించి తీరుపై అభినందించారు. పింప్రి స్టేషన్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఉన్నతాధికారుల తీరు ముంబై పోలీస్ శాఖలోనే కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment