ప్రపంచంలోనే అతి చౌకైన బైక్ ఇప్పుడు ఇండియాలో.. ధర ఎంత అంటే..

 ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఫీచర్ ఫోన్ మరియు టీవీ తీసుకొచ్చిన ఢిల్లీకి చెందిన ఎలక్ట్రికల్ బ్రాండ్ డీటెల్ సంస్థ తాజాగా అతి చౌకైన ఎలక్ట్రికల్ బైక్ ను విడుదల చేసింది. డీటెల్ ఈజీ పేరుతో ఈ బైక్ మార్కెట్ లో లభించనుంది. దీని ధర కేవలం రూ.19,999గా నిర్ణయించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన వాహనం అని సంస్థ పేర్కొంది. ఈ ఎలక్ట్రికల్ బైక్ పెర్ల్ వైట్, మెటాలిక్ రెడ్ మరియు జెట్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంది. 

ఈ ఎలక్ట్రికల్ బైక్ లో 48వి, 12 ఎహెచ్ తిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ చేసిన తర్వాత గంటలకు 25 కిలోమీటర్ల వేగంతో 60 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ బైక్ 6 పైప్ కంట్రోలర్ తో కూడిన 250 W మోటారుతో పనిచేస్తుంది. ఈ బైక్ కు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు.

ప్రస్తుతం పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రికల్ బైక్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్లకు మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. తక్కువ దూరం ప్రయాణించేందుకు ఈ బైక్ ఉపయోగపడుతుందని, దీనిపై సబ్సిడీ కూడా లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బైక్ తో పాటు ఒక ఛార్జర్ ఉంటుంది. ప్రతి ఎలక్ట్రిక్ బైక్ తో కంపెనీ హెల్మెట్లను ఉచితంగా అందిస్తోంది. ఈ బైక్ పై ఒకేసారి ఇద్దరు కూర్చొని వెళ్లవచ్చు. 

 

Leave a Comment