శ్రీరాముడిగా ప్రభాస్?

హీరో ప్రభాస్ తన అభిమానులకు సర్ ప్రైస్ ఇచ్చాడు. తన 22వ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఆది పురుష్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం ఉదయం 7.11 నిమిషాలకు ఈ చిత్ర టైటిల్ ను పోస్టర్ తో సహా విడుదల చేశారు. 

ఇంగ్లీష్ అక్షరం ‘ఏ’ ను హైలైట్ చేస్తూ ఆది పురుష్ అంటూ విడుదల చేసిన ఆ పోస్టర్ లో హనుమాన్, బాణం పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో ఆకారం ఉంది. కింద ‘చెడుపై మంచి సాధించే విజయాన్ని పండుగ చేసుకుందాం’ అనే క్యాప్షన్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగా లేదా విష్ణువుగా కనిపించనున్నారని అందరూ ఊహించుకుంటున్నారు. ఈ సినిమాను తెలుగు, హింది, కన్నడ, మలయాళ  భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. 

 

Leave a Comment