దేశంలో జనాభా లెక్కల సేకరణ వాయిదా వేసిన కేంద్రం

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మొదటి విడత జనాభా లెక్కల సేకరణను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల్లో పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు పార్తాప్ సింగ్ బజ్వా అడిగిన ప్రశ్నకు సమాధానంగా జనాభా లెక్కల సేకరణ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. 

జనాభా లెక్కల కోసం దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. దేశ నలుమూలల్లో ప్రతి ఇల్లు తిరిగి జనాభాను సంబంధించిన వివరాలు సేకరిస్తారు. అయితే కరోనా వైరస్ కారణంగా భౌతిక దూరం వంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో జనగణన ఇప్పట్లో జరిగే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కాగా ప్రతి పదేళ్లకు ఒక సారి దేశంలో ఉన్న ప్రజల సంఖ్యను తెలుసుకునేందుకు జనగణన నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 మొదటి విడత జనగణన ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కారణంగా దానిని నిలిపివేశారు. 

 

 

Leave a Comment