ఏపీలో మరో దారుణం.. విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

ఏపీలో గత కొద్ది రోజులుగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల అంతర్వేది రథం దహనం చేశారు. గతంలోనూ నెల్లూరు జిల్లా బిట్రగుంటలో రథం దహనమైంది. తాజాగా విజయవాడలో మరో దారుణం జరిగింది. నగరంలోని నిడమనూరులోని సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. 

ఆలయం వెలుపల ఉంచిన విగ్రహానికి తల, కాలు వేరు చేసినట్లు నిర్వాహకులు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీఐ సురేష్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి, చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

 

Leave a Comment