ఆకాశం నుంచి ఊడిపడిన అదృష్టం..రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది..!

అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరికి ఎన్ని పూజలు చేసినా అదృష్టం రాదు. మరి కొందరికి ఎక్కడ ఉన్నా కలిసివస్తోంది. తాజాగా ఒక వ్యక్తికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది. ఆకాశం నుంచి పడ్డ ఉల్క ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. 

 ఇండోనేషియాలోని ఉత్తర సుమాత్రాలో జోషువా హుటాగలుంగ్ అనే 33 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు శవపేటికలను తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తన ఇంటి పై కప్పు మీద ఒక ఉల్క పడింది. ఎవరైనా తన ఇంటి మీ రాయి వేశారా అని అనుకున్నాడు. దానిని చేతిలోకి తీసుకున్నప్పుడు అది వేడిగా ఉంది. దానిని పరిశీలించి చూస్తే అది చాలా విలువైన రాయి అని తెలుసుకున్నాడు.

ఇది సీఎం ½ కార్బోనేషియస్ కొండ్రైట్ వర్గానికి చెందిన అరుదైన స్పేస్ కార్ అని గుర్తించారు. ఈ స్పేస్ రాక్ 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. అమెరికాకు చెందిన ఉల్క నిపుణుడు జేర్డ్ కొల్లిన్స్ ఆ గ్రహ శకలానికి భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడు. దానికి జోసువాకు ఏకంగా 1.8 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.13.37 కోట్లు) వచ్చాయి.    

 

   

Leave a Comment