హాలీడే ఎంజాయ్ చేస్తున్న రకూల్..

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. తన అందం, నటనతో మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. ఓ వైపు తెలుగులో నటిస్తూనే బాలీవుడ్ లోను అప్పుడప్పుడు నటిస్తోంది. తాజాగా రకుల్ కు బాలీవుడ్ లో మరో అవకాశం వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాశం దక్కింది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాన్ని రకుల్ కొట్టేసింది. 

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)


ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు హాలీడే ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లో ఆకుపచ్చ స్విమ్ సూట్ ధరించి సముద్రపు అందాలను ఆస్వాదిస్తోంది. ఈ హాట్ ఫొటోను రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పాటు ‘సౌత్ సెలబ్రిటీస్’ తన ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ బీచ్ లో దిగే వీడియో క్లిప్ కూడా షేర్ చేసింది.  

Leave a Comment