యూట్యూబర్ పై రూ.500 కోట్ల పరువు నష్టం దావా..

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రషీద్ సిద్ధిఖీ అనే యూట్యూబర్ పై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు బీహార్ కు చెందిన ఈ యూట్యూబర్ కు నోటీసులు ఇచ్చారు. రియా చక్రవర్తి కెనడా పారిపోవడానికి అక్షయ్ కుమార్ సహాయం చేశాడని, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మరియు ఆదిత్య ఠాక్రేతో రహస్య చర్చలు జరిపాడని సిద్ధిఖీ తన యూట్యూబ్ ఛానెల్ ఎఫ్ఎఫ్ న్యూస్ వీడియాలలో ఆరోపించాడు. 

అంతే కాదు ఎంఎస్ ధోని సినిమా సుశాంత్ దక్కడం పట్ల అక్షయ్ అసంతృప్తిగా ఉన్నట్లు యూట్యూబ్ ఛానెల్ లో చూపించాడు. ఇలా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేేసులో ఫేక్ న్యూస్ లు ప్రసారం చేయడం ద్వారా సిద్దిఖీ నాలుగు నెల్లలో సుమారు రూ.15 లక్షలకుపైగా సంపాదించాడు. 

గతంలో ఈ యూట్యూబర్ పై శివసేన లీగ్ సెల్ న్యాయవాది ధర్మేంద్ర మిశ్రా కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టంతా లాగారు. సదరు యూట్యూబర్ తన ఛానెల్ సబ్ స్క్రైబర్స్ పెంచుకునేందుకు ఫేక్ వార్తలను వ్యాప్తి చేసినట్లు తెలిసింది. దీంతో సిద్దిఖీ తన సబ్ స్క్రైబర్స్ ను లక్ష నుంచి 3.70 లక్షలకు పెంచుకున్నాడు. అంతే కాదు మే నెలలో సిద్దిఖీ సంపాదన కేవలం రూ.229 కాగా, సెప్టెంబర్ లో తన వీడియోల ద్వారా అత్యధికంగా రూ.6.5 లక్షలు సంపాదించాడు. అయితే ఈ కేసులో సిద్ధిఖీకి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి పోలీసులకు సహకరించమని కోరింది.  

   

Leave a Comment