ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిటీ స్కాన్ ధర రూ.3 వేలు..!

ఆంధ్రప్రదేశ్ లో కోరనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ స్కాన్ పై ఆస్పత్రులకు, ల్యాబ్ లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సిటీ స్కాన్ ధరను రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో రూ.3 వేలకు మించి వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 

సిటీ స్కాన్, పాజిటివ్ వచ్చిన వారి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 డాష్ బోర్డులో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించింది. ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో కరోనా నిర్ధారణ అయితే వారికి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్స్  బెడ్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. 

  కోవిడ్ అనుమానితులకు పరీక్షలు నిర్వహించి కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాత హాస్పిటల్స్ బెడ్స్ లేవు అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యవ వహించాలని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో కోవిడ్ అనుమానితులు పూర్తి సమాచారాన్ని అప్ లోడ్ చేయాలని చెప్పింది. స్కానింగ్ కోసం వస్తున్న వారి నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.   

 

Leave a Comment