వరుడికి కరోనా.. బెదరని వధువు.. కోవిడ్ వార్డులోనే పెళ్లి చేసుకుంది..!

వారం రోజుల్లో పెళ్లి ఉంది.. అంతలోనే వరుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికే కాదు అతని తల్లికి కూడా పాజిటివ్ వచ్చింది. ఈ సమయంలో వధువు తరుపువారు ఆందోళన చెందుతారు. పెళ్లి వాయిదా వేసుకుందామని అనుకుంటారు. కానీ వధువు మాత్రం అనుకున్న సమయానికి కోవిడ్ వార్డులోనే వరుడిని పెళ్లి చేసుకుంది. కేరళ రాష్ట్రం అళపుజ జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వీరి పెళ్లి జరిగింది.. 

కైనంకరికి చెందిన శరత్ మాన్, అభిరామికి వివాహం కుదిరింది. ఏప్రిల్ 25న పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ పెళ్లికి వారం రోజుల ముందు శరత్ కరోనా బారినపడ్డాడు. అతని తల్లికి కూడా కరోనా వచ్చింది. దీంతో వీరిద్దరూ అలప్పుజా మెడికల్ కాలేజీలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే అనుకున్న తేదీకే పెళ్లి చేసుకోవాలని వధువు అభిరామి నిశ్చయించుకుంది. 

ఈక్రమంలో ఇరు కుటుంబాలు కలిసి జిల్లా కలెక్టర్ కు తమ ప్రతిపాదన చేశారు. దీనికి కలెక్టర్ అంగీకరిచారు. దీంతో మెడికల్ కాలేజీలోని కోవిడ్ వార్డు కొద్ది సేపు పెళ్లి మండపంగా మారింది. అభిరామి పీపీఈ కిట్ లో కోవిడ్ వార్డులో ప్రవేశించగా, శరత్ తల్లి వారికి పూలదండలు అందజేసింది. శరత్, అభిరామి ఇద్దరు దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు వైద్య సిబ్బంది వారిని ఆశీర్వదించారు. 

 

 

Leave a Comment