రీపేరీకి ఖర్చు అవుతుందని.. టెస్లా కారును పేల్చేశాడు..వీడియో వైరల్..!

ఓ ఖరీదైన కారు కొనాలని చాలా మందికి కల.. అలా ఓ వ్యక్తి కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొన్నాడు. ఎంతో ఇష్టపడి కొన్న కారులో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఏకంగా ఆ కారును పేల్చేశాడు. ఈ ఘటన ఫిన్లాండ్ లో జరిగింది. ఎలన్ మస్క్ చేసిన అద్భుతమైన ఆవిష్కరణలలో టెస్లా కారుకు ప్రత్యేక స్థానం ఉంది. దిక్షిణ ఫిన్లాండ్ లోని కైమెన్ లాక్సోకికి చెందిన థామస్ కెటెనిన్ అనే వ్యక్తి టెస్లా కారును కొనుగోలు చేశాడు.

ఆ టెస్లా కారు మొదట 15 వందల కిలోమీటర్ల దూరం బాగానే ప్రయాణించింది. తర్వాత సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ఎర్రర్ కోడ్ వంటి సమస్యలు రావడంతో ఆ కారును టెస్లా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అక్కడ సర్వీసింగ్ కి రూ.17 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. మొత్తం బ్యాటరీ ప్యాక్ నే మార్చాలని వారు తెలిపారు. 

ఇది విన్న థామస్ కి కోపం వచ్చేసింది. రిపేర్ కే అంత మొత్తం ఖర్చు అవుతుంటే.. ఇక కారు ఎందుకని అనుకున్నాడు. టెస్లా కంపెనీపై కోపంతో కారును పేల్చి వేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడు. కారును పిప్పి చేసేందుకు 30 కిలోల డైనమైట్లను కొన్నాడు. కారును మంచుతో కప్పబడి ఉండే జాలా అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ జనవాస ప్రాంతాలకు చాలా దూరంగా తీసుకెళ్లి కారు చుట్టూ డైనమైట్లు అమర్చాడు. ఎలన్ మస్క్ ముఖంతో ఓ బొమ్మను తయారు చేసి కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఆ కారును పేల్చేశాడు. 

కారు పేల్చే సన్నివేశాలను వీడియో తీసేందుకు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు సమాచారమిచ్చాడు. యూట్యూబ్ ఛానల్ సిబ్బంది కారు పేలుస్తున్న దృశ్యాలను చిత్రీకరించి యూట్యబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. సుమారు రూ.కోటి విలువ చేసే టెస్లా కారును ఇలా పల్చడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.      

Leave a Comment