ఈ దగ్గు మందుతో ముగ్గురు చిన్నారులు మృతి.. అది చాలా ప్రమాదకరమట..!

ఢిల్లీలోని కళావతి శరణ్ పిల్లల ఆస్పత్రిలో గత అక్టోబర్ నెలలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో 13 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణ జరపగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారుల మృతికి హానికరమైన దగ్గు మందు కారణమని తేలింది. డెక్స్ ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ తాగడం వల్ల ఆ చిన్నారులు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(DGHS) సోమవారం వెల్లడించింది. 

 DGHS నివేదిక ప్రకారం కళావతి శరణ్ ఆస్పత్రిలో 16 డెక్స్ ట్రోమెథార్ఫాన్ తీసుకున్న కేసులు నమోదయ్యాయి. వారిలో ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ పిల్లలకు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లు డెక్స్ ట్రోమెథార్ఫాన్ సిరప్ ని సూచించాయి. దీని కారణంగానే పిల్లల చనిపోయారని DGHS పేర్కొంది. పరిశోధనల్లో ఇది హానికరమందు అని తేలందని చెప్పింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నాలుగు ఏళ్లలోపు పిల్లలకు డెక్స్ ట్రోమెథార్ఫాన్ మందు ఇవ్వకూడదని, మొహల్లా క్లినక్లకు, డిస్పెన్సరీలలో పంపిణీ చేస్తున్న మందును వెంటనే సీజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి DGHS ఆదేశించింది. 

 

Leave a Comment