సీఎం జగన్ బర్త్ డే.. వినూత్న రీతిలో శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖుల, వైసీపీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ బర్త్ డే విషెస్ తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 

పరుగులు పెట్టిన ఎంపీ మాధవ్:

ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అందర్నీ పరుగులు పెట్టించారు. తెల్లవారుజామున శరీరం గడ్డ గట్టే చలిలో రోడ్డుపై పరుగులు తీశారు. ఎక్కడా ఆగకుండా మూడు కిలోమీటర్ల మేర ఈ పరుగు సాగింది. ఆయన పరిగెడుతుంటే.. వెనుక గన్ మెన్ లు, అనుచరులు కూడా పరుగులు పెట్టారు.

రూబిక్ క్యూబ్ లతో జగన్ చిత్రపటం:

తిరుపతిలో యువ నాయకులు భూమన అభినయ్ రెడ్డి రూబీక్ క్యూట్స్ తో వినూత్నంగా సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. రూబీక్ క్యూబ్ లతో జగన్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రూబీక్ క్యూబ్ తో తయారు చేసిన ఈ చిత్రం అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. అభినయ్ రెడ్డి తిరుపతిలోని మేక్ మైన బేబీ ట్రైనింగ్ స్కూల్ లో మూడు నెలల పాటు రూబీక్ క్యూబ్స్ అమర్చడంలో శిక్షణ పొందారు.  

 

 

 

Leave a Comment