ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో పది పరీక్షల రద్దు లేదు. యథావిధిగానే పరీక్షలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా  గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ మరియు తమిళనాడు ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ఆ ప్రభుత్వాలు ప్రకటించాయి. 

అయితే ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. జులై 10 నుంచి యథావిధిగా పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. 

ముందుగా ప్రకటించిన విధంగా పరీక్ష కేంద్రంలో 10 నుంచి 12 మందిని మాత్రమే అనుమతిస్తారు. పరీక్షలను కూడా 11 నుంచి ఆరుకు తగ్గించి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గదిలో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. 

 

Leave a Comment