ఇది ఇచ్చే ప్రభుత్వం..కత్తిరించే ప్రభుత్వం కాదు : సీఎం జగన్

‘జగనన్న చేదోడు’ ప్రారంభం..

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట బైబిల్, ఖరాన్, భగవద్గీతగా భావిస్తానని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా సీఎం జగన్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆయన ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా షాపులున్న రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు  ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.247 కోట్లు వారి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవాడికి అందాలన్నారు. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించాలని చెప్పారు. 

కొన్ని శతాబ్ధాలుగా మన సమాజంలో ప్రజలకు సేవ చేస్తూ కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న వారి కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. 

గ్రామ వలంటీర్ల ద్వారా వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేశామని, ఏదైనా అర్హత ఉండి కూడా రాకపోతే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాని వారు అర్హత ఉంటే అప్లికేషన్‌ పెడితే వెరిఫికేషన్‌ చేసి ఒక నెలరోజుల్లోగా అందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది కానీ ఎలా కత్తిరించాలి అని ఆలోచించే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. 

Leave a Comment