గోవధ చేస్తే జైలుకే..యూపీ సర్కార్ కొత్త ఆర్డినెన్స్

గోవుల సంరక్షణ విషయంలో కఠినంగా ఉండే యూపీ ప్రభుత్వం ఇప్పుడు  మరో సంచలన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఇక నుంచి గోవును వధిస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ నుంచి కూడా ఆమోదముద్ర లభించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం గరిష్టంగా పదేళ్ల వరకు మరియు రూ.5లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. శిక్షలు ఇలా ఉన్నాయి.

  • మొదటిసారి గోవధ చేస్తూ పట్టుబడితే వారికి ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. దీంతో పాటు రూ.1లక్ష నుంచి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
  • ఇక రెండో సారి పట్టుబడితే పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. మరియు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. 

ఈ ఆర్డినెన్స్ ప్రకారం అనధికారికంగా గొడ్డు మాంసాన్ని లేదా ఆవులను రవాణా చేస్తూ పట్టుబడినా డ్రైవర్ తో పాటు వాహనం యజమానిపై కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇక స్వాధీనం చేసుకున్నఆవుల నిర్వహణ కోసం ఖర్చులను నిందితులు ఒక సంవత్సరం లేదా ఆవులను విడుదల చేసే వరకు భరించాల్సి ఉంటుంది. ఏదైనా గాయం అయినా లేదా మ్యుటిలేషన్ ద్వారా ఆవుల ప్రాణాలకు ప్రమాదం ఉంటే నిందితులకు శిక్ష కూడా విధిస్తారు.

 

Leave a Comment