ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. అలాగే మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఇక నుంచి స్కూళ్లకు ప్రత్యేక యాప్ ఉండనుంది. ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల హాజరు వివరాలను యాప్‌ ద్వారా అధికారులు సేకరించనున్నారు. స్కూల్‌కు పిల్లలు వెళ్ళకపోతే తల్లిదండ్రులకు యాప్ ద్వారా మెసేజ్ చేయనున్నారు. రెండో రోజు రానట్లైతే స్వయంగా వాలంటీర్లు వెళ్లి వాకబు చేయనున్నారు. 

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..

జూన్ 7 – ఫస్ట్ లాంగ్వేజ్

జూన్ 8 – సెకండ్ లాంగ్వేజ్

జూన్ 9 – ఇంగ్లీష్

జూన్ 10 – గణితం

జూన్ 11 – ఫిజికల్ సైన్స్

జూన్ 12 – బయోలాజికల్ సైన్స్

జూన్ 14 – సోషల్ స్టడీస్

జూన్ 15 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 ఓఎస్ఎస్సీ మేయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పర్షియన్)

జూన్ 16 – ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)

 

Leave a Comment