టీడీపీ జెండా చూస్తే జగన్ కు వణుకు : నారా లోకేష్ 

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో శ్రీనివాసరెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి జనగ్ రెడ్డి ఉన్మాదిలా మారి ప్రాణాలు తీస్తున్నాడని ఆరోపించారు. గతంలో జగన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల ఆయన తండ్రికి ఏమైందో అందరం చూశామన్నారు. 

ఇప్పుడు ఏకంగా జగన్ రెడ్డి మహిళల తాళి బొట్టులు తెంపుతున్నాడన్నారు. ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదని, దీనికి జగన్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. వైసీపీ అధికారం చేపట్టిన తరువాత 19 మంది కార్యకర్తలను హత్య చేశారన్నారు. 1350 కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు.

అచ్చన్న అరెస్టు అప్రజాస్వామికమని, పట్టాభి పై దారుణంగా దాడి చేశారని తెలిపారు. టీడీపీ జెండా చూస్తే జగన్ రెడ్డి భయంతో వణుకుతున్నారన్నారు. అందుకే నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. దమ్ముంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. 

వైసీపీ నేతలపై మృతుడు శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా సిఐ ఎందుకు స్పందించలేదని, ఫిర్యాదు చేసిన శ్రీనివాసరెడ్డిని ఉదయం స్టేషన్ పిలిపించారని, సాయంత్రం హత్య చేశారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే అన్నారు. శ్రీనివాస రెడ్డి కుటుంబాన్ని వేధించి,హత్య చేసిన వైసీపీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

Leave a Comment