గ్యాస్ సిలిండర్ పై మళ్లీ బాదుడు.. ఎంత పెరిగిందంటే?

గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇప్పటికే అల్లాడుతున్న సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఫిబ్రవరి 1న గ్యాస్ ధరు పెంచకపోవడంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈక్రమంలో మళ్లీ ప్రభుత్వం ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 

సబ్సిడీ సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.184 పెంచాయి. సవరించిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ సిలిండఱ్ ధర రూ.664 ఉండగా.. తాజాగా పెంచిన ధరతో రూ.719కి చేరింది. కోల్ కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.50 కి చేరింది.  

Leave a Comment