అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

వలసలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధం

కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 7 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 42 వేలకుపైగా మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 

యునైటెడ్ స్టేట్స్ లో వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎగ్జిక్యూటివ్ ఉత్వర్వులపై సంతకం చేస్తానని ట్రంప్ ట్విట్ చేశాడు. కంటికి కనిపించని శత్రువు దాడి నుంచి అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసకున్నట్లు వెల్లడించారు. 

కరోనా వైరస్ వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటి నుంచి కనీసం 22 మిలియన్ల అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో అమెరికా పౌరుల్లో ఉద్రేకం పెరుగుతోంది.  

మరో వైపు చైనాపై కూడా ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు. కరోనా మహమ్మారి ఎల పుట్టిందని కనుగొనేందుకు చైనాకు నిపుణుల బృందం పంపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. విపత్కర పరిస్థితులలో చైనా తమకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 24 లక్షలను దాటాయి. మరణాల సంఖ్య 1,69,900కు దాటింది. 

Leave a Comment