Facebook Gaming App లాంచ్

ప్రముఖ సోషల్ నెటవర్క్ Facebook కొత్తగా Gaming App ని లాంచ్ చేసింది. Amazon యాజమాన్యంలోని ట్విచ్ ప్లాట్ ఫామ్ కు సవాలుగా ఈ గేమింగ్ యాప్ ను ఫేస్ బుక్ రూపొందించింది. ఈ యాప్ లో మనం లైవ్ గేమ్స్ అడటానికి వీలుంటుంది. 

ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ కొత్త ఫేస్ బుక్ గేమింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గేమింగ్ లవర్స్ కు బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ లో మనం Facebook లో లైవ్ లో గేమ్ ఆడుకోవచ్చు. మరియు ఇతరులు ఆడే గేమ్స్ ను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ యాప్ ద్వారా గ్రూప్ గేమ్స్ కూడా ఆడవచ్చు. 

ఇందులో ఇంకో విశేషం ఏంటంటే, ఈ గేమింగ్ యాప్ లో ఎవరైనా లైవ్ లో ఆడుతుంటే వారితో చాట్ చేయవచ్చు. వారికి సలహాలు కూడా ఇయ్యొచ్చు. లేక మీరు ఎవరితోనైన Live Game ఆడాలనుకుంటుంటే వారికి నాతో ఆడమని డైరెక్టుగా మెసేజ్ చేయవచ్చు. సో ఇది చాలా ఇంట్రస్టెంగ్ గా ఉంటుంది. మీరు గేమింగ్ లవర్ అయితే దీనిని ఒకసారి ట్రై చేయండి. 

Leave a Comment