WhatsApp ద్వారా గ్యాస్ సిలిండర్ ఇలా బుకింగ్ చేయండి..

ఈ రోజుల్లో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు. వాట్సాప్ ద్వారా మనం మెసేజ్ షేర్ చేసుకుంటుంటాం. అయితే వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. బహుష ఇది చాలా మందికి తెలియని విషయం. ప్రస్తుతానికి HP గ్యాస్ వినియోగదారులకు మాత్రమే వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవడమే కాకుండా మీ అకౌంట్ లో గ్యాస్ సబ్సిడీ గత ఆరు నెలలుగా ఎన్ని సార్లు పడింది..ఎంత జమ  అయింది.. మీరు ఎన్ని సిలిండర్లు వాడారు.. ఇంకా ఎన్ని వాడొచ్చు..వంటి అనేక వివవరాలను  తెలుసుకోవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా గ్యాస్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp ద్వారా Gas సిలిండర్ బుక్ చేయడం ఎలా?

  • ముందుగా HP గ్యాస్ కస్టమర్స్ 9222201122 WhatsApp నెంబర్ ను సేవ్ చేసుకోవాలి. 
  • తర్వాత మీ వాట్సాప్ ద్వాారా పై నెంబర్ కు HELP అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. 
  • మీకు ఒక మెసేజ్ వస్తుంది. అది కింది విధంగా ఉంటుంది. 
  • ‘Please send any of the below keywords to get help.SUBSUDY/QUOTA/LPGID/BOOK GAS అని వస్తుంది. 
  • BOOK అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి. కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ వివరాలు మీకు వాట్సాప్ రిప్లే రూపంలో వస్తాయి. 
  • అవి కరెక్ట్ అయితే..  Y అని టైప్ చేసి సెండ్ చేయాలి. 
  • అప్పుడు వెంటనే Booking Confirm అని మెసేజ్ వస్తుంది. అందులో రిఫరల్ నెంబర్, డెలివరీ ఆతెంటికేషన్ కోడ్ వస్తాయి. అంతే.

సబ్సిడీ వివరాల కోసం..

  • SUBSIDY అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి. మీ వివరాలు ఇలా కనిపిస్తాయి. 

Refill subsidy sent on:2020-01-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK

QUOTA  వివరాల కోసం..

  • QUOTA అని టైప్ చేసి మెసేజ్ చేయాలి.
  • మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు 4/12 సిలిండర్లు వాడారు..మరో 8 వాడుకోవచ్చు అని వస్తుంది. 

LPG వినియోగదారులు 17 నెంబర్లను తెలుసుకోవడానికి LPGID అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. లేదా www.mylpg.in లో వివరాలు ఇచ్చి..ఐడీ పొందవచ్చు. 

Leave a Comment