తెలుగు షార్ట్ ఫిల్మ్ కి గిన్నీస్ బుక్ లో చోటు..!

ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది.. సినిమాలే కాదు.. తెలుగు షార్ట్ ఫిల్మ్ లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. తాజాగా తెలుగు షార్ట్ ఫిల్మ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అంతేకాదు ఆస్కార్, భాఫ్టా ఎంటీలను కూడా అందుకుంది. 

గతేడాది దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గా మనసానమః ఎంపికైంది. అంతేకాదు.. ఆస్కార్, బ్రిటీష్ అకాడమీ అవార్డుల ఎంట్రీలకు కూడా వెళ్లింది. ఈ షార్ట్ ఫిల్మ్ ని గజ్జల శిల్పా నిర్మించారు. విరాజ్ అశ్విన్, దృషికా చందర్, శ్రీవల్లీ రాఘవేందర్, పృథ్వీ శర్మ ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించారు. సంగీత దర్శకుడు సయ్యద్ కమ్రాన్, సినిమాటోగ్రాఫర్ ఏడురోలు రాజుకు కూడా వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి. అవార్డు లభించడంపట్ల నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు. 

 

Leave a Comment