పానీపూరీ అమ్మకాలపై నిషేధం.. ఎక్కడంటే..!

ఖాట్మండు వ్యాలీలోని లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో పానీ పూరీ అమ్మకాలను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. లోయలో కలరా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాలీలోని లలిత్ పూర్ లో 12 కలరా కేసులు నమోదయ్యాయి. పానీపూరీలలో ఉపయోగించే నీళ్లలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

వ్యాలీలో కలరా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొంటూ.. రద్దీ ప్రాంతాల్లో మరియు కారిడార్ ప్రాంతంలో పానీపూరీ విక్రయాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. కలరా సోకిన వారు ప్రస్తుతం టేకులోని సుక్రరాజ్ ట్రాపికల్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలరా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. 

 

Leave a Comment